భర్త ఎమ్మార్వో.. భార్య న్యాయం కోసం పోరాటం

భర్త ఎమ్మార్వో.. భార్య న్యాయం కోసం పోరాటం

హన్మకొండ నగరంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ములుగు జిల్లా వెంకటాపురం ఎమ్మార్వో గిరిబాబు భార్య ఝాన్సీ రాణి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తన భర్త అక్రమ సంబంధం పెట్టుకుని తాను, పిల్లలను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో సహజీవనం చేస్తున్న ఎమ్మార్వోపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.