గోకఫసల్‌వాడ్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి
VKB: గోకఫసల్‌వాడ్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పల్లెటూరు మొత్తం పండగ కళతో మెరిసిపోతోంది. ఇంటి ముందర ఆడపడుచులు రంగురంగుల ముగ్గులు వేస్తూ, గొబ్బెమ్మలతో అలంకరిస్తూ సందడి చేస్తున్నారు. పండగ పిండివంటల ఘుమఘుమలతో వీధులన్ని నిండిపోయాయి. అరిసెలు, జంతికలు వంటి రుచికరమైన వంటకాలు చేస్తూ సంప్రదాయాన్ని చాటుతున్నారు. బంధుమిత్రుల రాకతో కొత్త వెలుగు వచ్చింది.