ఈనెల 18 నుంచి రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ

SRD: సంగారెడ్డి జిల్లాలో రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య సోమవారం తెలిపారు. శిక్షణకు 172 మంది లైసెన్స్ సర్వేలను ఎంపిక చేసినట్లు చెప్పారు. బీసీ స్టడీ సర్కిల్లో 50 రోజులపాటు శిక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. మొదటి విడత 160 మందికి శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.