'పులి' సంచారం.. రంగంలోకి ప్రత్యేక దళాలు

'పులి' సంచారం.. రంగంలోకి ప్రత్యేక దళాలు

KKD: అల్లూరి జిల్లాలో గడగడలాడించిన పులి తిరిగి కోరుకొండ పరిసరాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. రామదుర్గం మీదుగా కాపవరం పాండవుల మెట్టకు పులి చేరుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. జనావాసాలకు చేరువలో పులి తిష్ఠ వేయడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. 2 ప్రత్యేక దళాలు రంగంలోకి దిగి బోన్లు ఏర్పాటు చేయగా.. పుణే నుంచి నిపుణులు వస్తున్నారు.