జిల్లా జట్టుకు ఎంపికైన తొర్రూరు విద్యార్థిని
JN: పాలకుర్తి మండలంలోని తొర్రూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పసులాది హారిక 69వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలలో వరంగల్ జట్టుకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ పెనుగొండ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జట్టుకు ఎంపికైన హారికను ఉపాధ్యాయులు అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.