అనారోగ్యంతో బాధపడుతూ యువకుడు ఆత్మహత్య

కృష్ణా: కోడూరు 8వ వార్డుకు చెందిన రాజబోయన సోమేశ్వరరావు (35) తీవ్ర గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ, జీవితంపై విరక్తి చెంది ఆదివారం పందికొక్కుల బిల్లలు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో వెంటనే మచిలీపట్నం తరలించగా, అక్కడి నుంచి విజయవాడ తరలిస్తుండగా సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.