ఖాళీగా 32 ఉద్యోగాలు...వచ్చేవి వందల్లో దరఖాస్తులు

వరంగల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్‌లో వివిధ క్యాడర్ల ఉద్యోగాలు 32 ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా శుక్రవారం తొలిరోజే వందల సంఖ్యలో నిరుద్యోగులు బారులు తీరారు. ఆఖరి రోజు సోమవారం దరఖాస్తు దారులు భారీగా వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.