ఓటమి తట్టుకోలేక సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓటమిని తట్టుకోలేక కొడంగల్ మండలం ఖాజా హైమద్ పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.