వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్
నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్‌కు వెళ్లే మార్గంలో కుందూ నదిపై ఉన్న వంతెనను జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వంతెన దెబ్బతింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతన వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. పాత వంతెన మరమ్మతు పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. వంతెనపై భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు.