'మొక్కల సంరక్షణ బాధ్యత కార్యదర్శులదే'

KMM: పంచాయతీ పరిధిలోని మొక్కల సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శిలదేనని మండల ఎంపీడీవో మల్లెల రవీంద్ర ప్రసాద్ అన్నారు. సింగరేణి (కారేపల్లి)మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీని బుధవారం ఆయన సందర్శించారు. ఖమ్మం నుంచి ఇల్లెందు వెళ్లే మెయిన్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే విధంగా పనులను తక్షణమే ప్రారంభించాలని కార్యదర్శి లోకేశ్వరిని ఆదేశించారు.