ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కార్పొరేటర్ భూమిపూజ

KMM: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఖమ్మం 9వ డివిజన్‌కు మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులకు మంగళవారం కార్పొరేటర్ జానీబీ నాగుల్ మీరా, మున్సిపల్ అధికారి వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సాయం పొందాలని కోరారు.