దారకొండలో సైబర్ నేరాలపై అవగాహన
ASR: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటేనే ఆర్థిక మోసాలను అరికట్టవచ్చని యూనియన్ బ్యాంక్ కరస్పాండెంట్ దేవేంద్ర అన్నారు. నాబార్డ్, సీలేరు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం దారకొండలో కళాజాత బృందంతో అవగాహన కల్పించారు. బ్యాంక్ అధికారులు ఎప్పుడూ ఫోన్లో ఓటీపీలు అడగరని, అపరిచితులకు వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని ఆయన సూచించారు.