పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం: కలెక్టర్

KDP: సహజ రంగులతో తయారుచేసిన మట్టి గణపతి విగ్రహాలను వాడి వాటిని ప్రోత్సహించాలని, పర్యావరణ పరిరక్షణకు మన వంతు బాధ్యతగా చేయూతను అందిద్దామని కలెక్టర్ శ్రీధర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు మనమందరం సమిష్టిగా కృషి చేయడం వల్ల ఒక గొప్ప మార్పును సాధించవచ్చన్నారు. సహజ రంగులతో మట్టి విగ్రహాలను తయారు చేయడం స్వచ్ఛతకు చిహ్నమన్నారు.