VIDEO: జగన్‌ను కలిసిన ఫ్లాట్స్ బాధితులు
NTR: విజయవాడ భవానిపురంలో కూల్చి వేసిన 42 ప్లాట్స్ బాధితులు శుక్రవారం గన్నవరంలోని విజయవాడ ఎయిర్ పోర్టులో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్‌ను విస్మరించి తమ ఇళ్లను అధికారులు కూల్చి వేశారని తమ గోడును జగన్‌కు విన్నవించుకున్నారు. బాధితులకు అండగా ఉంటానని ఆయన వారికి భరోసా ఇచ్చారు.