గ్యాస్ ధరల పెంపుపై నిరసన
AKP: మాడుగుల మండలం శంకరం పంచాయతీ బొడ్డరేవు గ్రామంలో వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా సీపీఎం మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి మాట్లాడుతూ.. గ్యాస్ ధరల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే ధరలను తగ్గించాలన్నారు.