​హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే

​హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే

AP: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన వ్యక్తిగత వీడియోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. హర్షవీణ అనే మహిళ ఇచ్చిన కంటెంట్ భవిష్యత్‌లోనూ అప్‌లోడ్ కాకుండా, ప్రసారం చేయకుండా నిరోధించాలని కోరారు. దీనిపై పోలీసులను పూర్తి వివరాలు కోరిన న్యాయస్థానం.. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.