రెండవ దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు 530 పోలింగ్ కేంద్రాలు
SRCL: బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలాల్లో మొత్తం గ్రామ పంచాయతీలు 88, వార్డు స్థానాలు 758 ఉండగా, 11 సర్పంచ్ స్థానాలు, 228 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ నెల 14 వ తేదీన ఆదివారం 77 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, 530 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులు 279, వార్డు స్థానాలకు అభ్యర్థులు 1,296 మంది పోటీలో ఉన్నారు.