టీడీపీ నాయకుడి దారుణ హత్య

ప్రకాశం: ఒంగోలులో దారుణ హత్య జరిగింది. నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరికి ఒంగోలులోని పద్మ టవర్స్‌లో ఆఫీస్ ఉంది. ఇవాల ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసుకుని ఆఫీసులోకి వచ్చి వీరయ్య చౌదరిపై కత్తులతో దాడి చేశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.