నేటి నుంచి గజ్జలమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం
KMR: బీర్కూరు మండల కేంద్రంలో నేటి నుంచి గజ్జలమ్మ జాతర ఉత్సవాలు నిర్వహించనున్నామని సర్పంచ్ ధర్మతేజ తెలిపారు. నేడు రథానికి ప్రతిష్ఠాపనోత్సవ పూజలు ప్రారంభమవుతాయని, 3వ తేదీన తెల్లవారుజామున రథోత్సవం, సాయంత్రం ఎడ్లబండ్ల ప్రదర్శన, 4వ తేదీన కుస్తీ పోటీలు, జాతర నాటక ప్రదర్శన నిర్వహించనున్నామని తెలిపారు.