గండెపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే

KKD: గండేపల్లి మండలం కే. గోపాలపురంలో శుక్రవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యటించారు. ఈ సందర్భంగా 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన గిరిజనుల పెంకిటిల్లులు శిథిలావస్థలో ఉండటాన్ని ఆయన గుర్తించారు. పాడుబడిన ఆ ఇళ్ల స్థానంలో పీ4 పథకంలో భాగంగా ఇనుప రేకులతో మోడల్ ఇళ్లను నిర్మించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.