పీహెచ్‌సీ ఆవరణలో హిజ్రా మృతదేహం

పీహెచ్‌సీ ఆవరణలో హిజ్రా మృతదేహం

అల్లూరి: కొయ్యూరు మండలం డౌనూరు పీహెచ్‌సీ ఆవరణలో శనివారం ఓ హిజ్రా మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు గొలుగొండ మండలానికి చెందిన వ్యక్తి అని స్థానికులు చెబుతున్నారు. మృతుడు గత పది రోజులుగా డౌనూరు, మర్రిపాలెం ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీ.కిషోర్ వర్మ తెలిపారు.