క్రీడలతో స్నేహపూర్వక భావం: జంగా రాఘవరెడ్డి

WGL: క్రీడలతో స్నేహపూర్వక భావం పెంపొందుతుందని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఓ సిటీలో జరుగుతున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల ప్రారంభోత్సవంలో రాఘవరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని ఛైర్మన్ అన్నారు.