VIDEO: అహోబిలంలో భారీగా భక్తుల రద్దీ.!
NDL: ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వారాంతం కావడంతో ఎగువ, దిగువ అహోబిలానికి బెంగళూరు, హైదరాబాద్, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. క్షేత్రం అంతా భక్తుల రద్దీతో సందడిగా మారింది.