స్మార్ట్ మీటర్లను బిగించరాదంటూ సీపీఎం ధర్నా

స్మార్ట్ మీటర్లను బిగించరాదంటూ సీపీఎం ధర్నా

NLR: స్మార్ట్ మీటర్లను ఇళ్లకు బిగించరాదంటూ సోమవారం నెల్లూరు రూరల్ పరిధిలోని పడారుపల్లి సబ్ స్టేషన్ వద్ద సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు స్మార్ట్ మీటర్లను పడగొట్టండని చెప్పి నేడు స్మార్ట్ మీటర్లు బిగించడం ప్రజలను మోసగించడమేనన్నారు.