కార్మిక శాఖలో ఏసీబీ దాడులు

KRNL: నగరంలో ఉన్న కార్మిక శాఖలో శుక్రవారం ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కర్నూలుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాలలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కార్మిక శాఖలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న బాలు నాయక్‌పై ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు దాడి చేశారు. కాగా ఈ దాడులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.