VIDEO: మైదుకూరులో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

VIDEO: మైదుకూరులో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

కడప జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకుని ప్రైవేటీకరణను నిరసిస్తూ వినతి పత్రం అందజేశారు.