వర్ధన్నపేటలో ఇంటింటి ప్రచారానికి మంత్రి పొంగులేటి
WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిర్వహించనున్న ఇంటింటి ప్రచార కార్యక్రమానికి రెవిన్యూ & గృహ నిర్మాణాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా పాల్గొని, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.