జూనియర్ కాలేజీలో ఖాళీ సీట్లు

GNTR: గుంటూరు నందివెలుగు రోడ్డులోని ఏపీ ముస్లిం మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ BIPCలో 20, CECలో 15 సీట్లకు ముస్లిం పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సాంబశివరావు బుధవారం కోరారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జులై 31వ తేదీలోపు కళాశాల పనిదినాల్లో వచ్చి అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు.