కుత్బుల్లాపూర్ పరిధిలో విపరీతంగా పెరిగిన దోమల బెడద
MDCL: కుత్బుల్లాపూర్, గాజులరామారం, షాపూర్ నగర్, అల్వాల్, కొంపల్లి ప్రాంతాల్లో దోమల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కాలువలు శుభ్రం చేయకపోవడం, నిల్వ నీరు ఎక్కువగా ఉండడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల భయంతో ఆందోళన చెందుతున్నారు. వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.