VIDEO: టీమిండియా గెలుపు కోసం పూజలు
సత్యసాయి: మడకశిర మండలం నీలకంఠాపురం దేవస్థానంలో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించాలని కోరుతూ ఆదివారం అర్చకులు ప్రత్యేక హోమం నిర్వహించారు. ప్రతిరోజూ జరిగే నిత్య హోమాల్లో భాగంగా,నేడు దేశం కోసం ఈ ప్రత్యేక సంకల్పాన్ని స్వీకరించి భారత క్రికెట్ జట్టు సభ్యులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, కప్పును కైవసం చేసుకోవాలని వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమగుండంలో ఆహుతులు సమర్పించారు.