బక్రీద్ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన CI

CTR: ఈ నెల 7న జరిగే బక్రీద్ పండుగ ఏర్పాట్లను మంగళవారం అంజుమన్ కమిటీ సెక్రటరీ ఇబ్రహీంతో కలసి CI సుబ్బరాయుడు పరిశీలించారు. పుంగనూరు NS పేటలోని ఈద్గా మైదానానికి చేరుకున్నారు. తర్వాత ఏర్పాట్లపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. సామూహిక ప్రార్థనలు జరిగే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు CI తెలిపారు.