చలి తీవ్రతతో ప్రజలకు ఇబ్బందులు
MNCL: లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో శీతల గాలుల ప్రభావం ఇంకా తగ్గలేదు. శుక్రవారం తెల్లవారుజామున పలు మండలాల్లో 15 నుంచి 17° మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో శీతల గాలులతో చలి వాతావరణం కొనసాగింది. గ్రామాలకు వెళ్లే రోడ్లపై పొగ మంచు కమ్ముకుంది. పెరిగిన శీతల గాలుల ప్రభావంతో ప్రజలు బయటకు రావడం లేదు.