VIDEO: దారుణం.. కన్న తల్లిని చంపిన కొడుకు
WGL: కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన నగరంలోని కాశిబుగ్గలో నిన్న రాత్రి జరిగింది. రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న తన తల్లి కూరపాటి వెంకటమ్మ(65)ను రాయితో కొట్టగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోలీసులు MGM మార్చురీకి తరలించారు.