కర్నూలులో ముగిసిన 'జల సమర దీక్ష'
KRNL: కర్నూలులో కిసాన్ ఘాట్ వద్ద కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు హర్ష చేపట్టిన 48 గంటల జల సమర దీక్ష ముగిసింది. హర్షకు రైతు సంఘం నాయకులు సుంకన్న, భాస్కర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది హేమలత రెడ్డి నిమ్మరసం తాగించి దీక్షను విరమింప చేశారు. హర్ష మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాజెక్టుల సాధన కోసం కేపీఎస్ నిరంతరం కృషి చేస్తుందన్నారు.