ఉత్తమ ప్రిన్సిపాల్‌గా అవార్డు అందుకున్న వెంకటేశ్వరరావు
హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటిఐ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, ఉత్తమ అధికారిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ చేతుల మీదుగా ఆదివారం అవార్డును అందుకున్నారు. 100 శాతం అడ్మిషన్లు పూర్తి చేసిన నేపథ్యంలో వెంకటేశ్వరరావుకు జిల్లా ఉత్తమ అధికారిగా ప్రభుత్వం గుర్తించింది.