VIDEO: లకవత్ తండాలో బీఆర్ఎస్ నేతల సంబరాలు

VIDEO: లకవత్ తండాలో బీఆర్ఎస్ నేతల సంబరాలు

JN: పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకున్న సందర్భంగా దేవరుప్పుల మండలం లకవత్ తండాలో బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. జై దయన్నా అంటూ నినాదాలు చేశారు. మళ్ళీ తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.