VIDEO: యాదాద్రి స్వామివారికి నిత్య నిజాభిషేకం

BNR: యాదగిరిగుట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి బుధవారం ఉదయం నిత్య నిజాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం పాలు, పెరుగు, పంచదార పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేకం వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అభిషేకంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి, మొక్కులు తీర్చుకున్నారు.