శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్

RR: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ అలర్ట్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలను ముమ్మరం చేశారు.