ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లల జననం
SRD: కొండాపూర్ గ్రామానికి చెందిన సభా బేగంకు ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. హైదరాబాద్ హైదర్ గూడలోని ఫెర్నాంటేజ్ ఆసుపత్రిలో కాన్పు కోసం రెండు రోజుల క్రితం చేరారు. గురువారం రోజు ముగ్గురు ఆడపిల్లలు పుట్టినట్లు తండ్రి సమియోద్దీన్ తెలిపారు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో కొండాపూర్ మండలంలో చర్చనీయంశమైంది.