'ఎస్‌ఐఆర్‌లో ఎలెక్టర్ మ్యాపింగ్ పూర్తి చేయాలి'

'ఎస్‌ఐఆర్‌లో ఎలెక్టర్ మ్యాపింగ్ పూర్తి చేయాలి'

MDCL: అల్వాల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల వివరాలతో ఎస్‌ఐఆర్‌లో ఎలెక్టర్ మ్యాపింగ్ పూర్తి చేయాలని అల్వాల్ మండల రెవెన్యూ అధికారి అన్నారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో 3 రోజుల ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నమోదు చేసుకోనివారు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.