బూత్ అధ్యక్షుడని పరామర్శించిన BJP నేతలు
JN: జఫర్‌ఘడ్ (M) వడ్డేగూడెం గ్రామానికి చెందిన బీజేపీ బూత్ అధ్యక్షులు దుద్దుల చంద్రమౌళి గౌడ్ ఇటీవల తాడిచెట్టుపై నుంచి కిందపడ్డాడు. దీంతో రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న BJP రాష్ట్ర నాయకుడు సుభాష్, జిల్లా పార్లమెంట్ కో కన్వీనర్ యుగేందర్ బాధితుడు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు ఉన్నారు.