VIDEO: సిబ్బంది ఎక్కడ? వీల్ ఛైర్ నడిపిన రోగి బంధువులు
WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం రోగి బంధువులే వీల్ ఛైర్ నడపాల్సి వస్తోందని, సిబ్బంది అందుబాటులో లేరని బాధితులు వాపోతున్నారు. సుమారు 30 మంది సిబ్బంది ఉన్నప్పటికీ సేవలు సక్రమంగా అందడం లేదని. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.