ఎంపీ చొరవతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు శ్రీకారం
ELR: కామవరపుకోట మండలం తడికలపూడిలోని NTR నైపుణ్యాభివృద్ధి & మహిళ సాధికారిత కేంద్రంలో కంప్యూటర్ ల్యాబ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సంకల్పంతో ఆదివారం ఈ కేంద్రానికి 12 లక్షల విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లు చేరాయి. డిజిటల్ యుగంలో మహిళలు, బాలికలు సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో ఈ కేంద్రం ఏర్పాటు చేయబడుతోంది.