రాజమండ్రి ఎయిర్‌పోర్టులో సుమ సందడి

E.G: కడియం మండలం వేమగిరిలో జరగనున్న గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తున్న యాంకర్ సుమ రాజమండ్రి ఎయిర్‌పోర్టులో సందడి చేశారు. మరికాసేపట్లో ఆమె సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈవెంట్‌కు సంబంధించి పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.