సమ సమాజ స్థాపకుడు బసవేశ్వరుడు

రంగారెడ్డి: సమ సమాజ స్థాపనలో జగజ్యోతి బసవేశ్వరుని మార్గదర్శకుడని తాండూరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. శుక్రవారం తాండూరు కోర్టు ఆవరణలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వరుని జయంతిని జరుపుకున్నారు. అసోసియేషన్ కార్యాయలంలో బసవేశ్వర చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. బసవేశ్వరునికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.