'జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

నెల్లూరు జిల్లాలో అకాల వర్షం, మంచు గాలుల వల్ల చలి తీవ్రత మరింత పెరిగింది. దీనితో ప్రజలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జ్వరం, దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వైద్యులు చలి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని, గోరువెచ్చని నీరు తాగాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.