'పనులు ప్రారంభించే వరకు రాకపోకలు కొనసాగాలి'
ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌక్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనులు నిలిచిపోయిన నేపథ్యంలో వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని రోడ్డు భవనాల అధికారులను మున్సిపల్ వైస్‌ఛైర్మన్ రోహిత్ కోరారు. బుధవారం పట్టణంలో స్థానిక కౌన్సిలర్లతో కలిసి సమావేశమై మాట్లాడారు. కోర్టు స్టే ఉన్నందున పనులు ప్రారంభించేంత వరకు రాకపోకలు ప్రారంభించాలని కోరారు.