VIDEO: అగ్ని ప్రమాదంలో గడ్డి వాము దగ్ధం

VIDEO: అగ్ని ప్రమాదంలో గడ్డి వాము దగ్ధం

అన్నమయ్య: రామసముద్రం మండల కేంద్రంలోని AS కాలనీలో రైతు గంగాధర్‌కు చెందిన గడ్డి వామికి శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు అనుమానం. ఈ ఘటనలో గడ్డి వామి పూర్తిగా దగ్ధమై, సుమారు రూ.25 వేల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.