చిత్తూరులో ఆన్‌లైన్ బెట్టింగ్ గుట్టు రట్టు

చిత్తూరులో ఆన్‌లైన్ బెట్టింగ్ గుట్టు రట్టు

CTR: ఐపీఎల్ మ్యాచ్‌ల పేరుతో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని చిత్తూరు 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో దాడులు నిర్వహించిన పోలీసులు, ఐదుగురిని అదుపులోకి తీసుకోగా విచారణ అనంతరం ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ ముఠాలోని మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.