'సీసీ రోడ్లతో గ్రామాలకు మహర్దశ రానుంది'

'సీసీ రోడ్లతో గ్రామాలకు మహర్దశ రానుంది'

KKD: కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్న సీసీ రోడ్లతో గ్రామాలలో మహర్దశ రానుందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాగ్ అన్నారు. సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను సోమవారం రంగనాగ్ పరిశీలించారు. నాణ్యతలో రాజీ లేకుండా సకాలంలో పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఇందులో భాగంగా గ్రామస్తులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.